నవతెలంగాణ – జుక్కల్: బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం రూ.307 ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. కానీ ఉపాధి కార్మికులకు రోజుకి కూలీ రూ.100 నుండి రూ.150 వస్తున్నాయని, కూలీలు ఆవేదన చెందుతున్నారని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరేది ఏందంటే.. పెరుగుతున్న నిత్యవసర సరుకులకు అనుగుణంగా ప్రభుత్వం కనీసం నిర్ణయించిన కూలీ రూ.307 కూడా ఇవ్వడం లేదని అన్నారు. వారిక కనీసం రోజు కూలీ ఊ.600 ఇవ్వాలని అన్నారు.మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని, ఉపాధి పనిని కాపాడుకోవాలని, కార్మిక 44 చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికుల్ని బానిసలుగా చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. అందుకే దేశవ్యాప్త సమ్మె జరుగుతుందని, ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలని హితవు పలికారు. కార్మికుల చట్టాలను యధావిధిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉపాధి కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా సురేష్ గొండ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఉపాధి హామీ గ్రామీణ కూలీలకు కనీసం 200 రోజులు పని దినాలు కల్పించాలని, వీరికి ఆరోగ్య కిట్లు, పని ప్రదేశంలో టెంట్లు వేయాలని, ఉపాధి కూలీలు వడదెబ్బతో చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈనెల 20న జరిగే కార్మిక కర్షక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ఉపాధి కూలీలు పేద రైతులు కార్మికులు స్వచ్ఛందంగా గ్రామీణ భారత్ బంద్ లో స్వేచ్ఛ గా పాల్గొని, సమ్మెను జయప్రదం చేయాలని నియోజకవర్గంలోని ప్రజలకు సురేష్ గొండ విజ్ఞప్తి చేశారు.
ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలి: సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES