Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెద్దపల్లి ఓసీపీ-3లో విషాదం

పెద్దపల్లి ఓసీపీ-3లో విషాదం

- Advertisement -

షావల్‌ బోల్తా పడి కార్మికునికి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలింపు


నవతెలంగాణ – యైటింక్లైన్‌ కాలనీ
దసరా పండుగనాడు సింగరేణిలో విషాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఆర్జీ-2 ఓసీపీ-3లో షావల్‌ బోల్తా పడి కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గురువారం 2వ బదిలీలో ఈ.లక్ష్మినారాయణ అనే ఈపీ ఆపరేటర్‌ నడుపుతున్న ప్రగతి షావల్‌ ఫైర్‌ కూల్‌ వద్ద పొగ ఎక్కువగా ఉండటంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కార్మికుని మెడ, తల లోపలి భాగంలో తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన సింగరేణి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఒమేగా ఆస్పత్రికి తరలించారు. పండగ పూట కార్మికులందరూ సంతోషంగా గడుపుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

రక్షణా చర్యల వైఫల్యమే ప్రమాదానికి కారణమా..
రక్షణా చర్యల వైఫల్యం మూలంగానే ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. పని ప్రదేశంలో ఫేస్‌ సరిగ్గా చేయాల్సిన డోజర్లు అందుబాటులో లేక ఇరుకుగా మారి కోల్‌ ఫైర్‌ అయ్యి దట్టమైన పొగ వచ్చి కనపడకనే షావల్‌ అదుపు తప్పి ప్రమాదానికి గురయింది. దాదాపుగా 20 డోజర్లతో ఫేస్‌ సరి చేయాల్సిన పనిని 3 డోజర్లు పెట్టి పనులు చేపిస్తుండటం, పనుల్లో యాజమాన్యం అలసత్వం వహించడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. జనరేటర్‌ సదుపాయం లేక, లైటింగ్‌ రాక.. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని కార్మికులు, కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -