శ్రద్ధాంజలి ఘటించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి, బాపు సమాధి వద్ద గురువారం గవర్నర్, సీఎం తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహాత్ముడు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం గాంధీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు.
నివాళ్లర్పించిన వారిలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, పర్యాటకశాఖ ఎండీ క్రాంతి వల్లూరి, అడిషనల్ సీపీ తాప్సీర్ ఎక్బాల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES