- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి కొనుగోళ్ల అంశంపై ఆయన సమీక్షించారు. ‘ఎలాగైనా వారంలోపు పత్తి కొనుగోళ్లు చేపట్టాలని మిల్లర్లకు సూచించాం. సోమవారం సీసీఐ సీఎండీ, కాటన్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశమవుతాం. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సీసీఐ టెండర్లలో పాల్గొనక ఏర్పడిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపారు.
- Advertisement -