జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్..
కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్
నవతెలంగాణ – భూపాలపల్లి
సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ ) 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణలో దాని అమలు, ప్రభుత్వ విధానాలు, స్వచ్ఛంద సంస్థల పాత్ర, పౌరుల భాగస్వామ్యం కావాలని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జయశంకర్,భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పోచయ్య లు పిలుపునిచ్చారు.ఆదివారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు సమాచార హక్కు చట్టం తెలంగాణలో 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నట్లుగా తెలిపారు. సమాచార హక్కు చట్టం, 2005 అక్టోబర్ 12న దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చి, ఈ ఏడాది 20 ఏళ్లు పూర్తి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చట్టం ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి రూపొందించబడిందమన్నారు.”ప్రజల చేతుల్లో ప్రభుత్వ అధికారం” అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రంలో సాధించిన పురోగతి, సవాళ్లు, భవిష్యత్ మార్గంపై ఒక పరిశీలన చేసిందని తెలిపారు.
ప్రభుత్వ విధానాలు,అమలు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిఐ చట్టం రాజకీయ కారణాలతో అమలులో మిశ్రమ ఫలితాలను చూపిందన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు సమాచారాన్ని సకాలంలో అందించడం లేదని మరికొన్నింటిలో జాప్యం,తిరస్కరణలు,అసంపూర్ణ సమాచారం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ అధికారులు సమాచార హక్కు చట్టాన్ని సకాలంలో అందించాలని పూర్తి సమాచారం ఇవ్వాలని తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. ఈనెల 5 నుంచి 12 తారీకు వరకు ఆర్టిఐ వారోత్సవాలు ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ( పిఐఓ) పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకు సెమినార్ ఏర్పాటు చేసి సరియైన శిక్షణ ఇవ్వాలని, సమాచార హక్కు చట్టాన్ని సహ చట్టం, ఉద్యమకారులకు ప్రజలకు, సకాలంలో సమాచారాన్ని సరియైన సమయంలో అందివ్వాలన్నారు.
సమాచార హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని దీనివల్ల ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యం అవుతోందన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమాచార అధికారులు (పిఐఓ) కు తగిన శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ కార్యాలయాల అధికారులు జవాబుదారీతనాన్ని ఉండాలని పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలున నిర్వహించాలన్నారు.ప్రభుత్వ తప్పిదాలను, అవినీతిని వెలికితీయడంలో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఈ చట్టాన్ని ఒక శక్తివంతమైనదని జిల్లావ్యాప్తంగా మండల స్థాయి నుండి డివిజన్ స్థాయి జిల్లా అధికారులు ఆర్టిఐ ఘనంగా వారోత్సవాలు జరపాలని స్వచ్ఛంద సేవ సంస్థలు ఎన్జీవోలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆర్టిఐ ద్విదశాబ్ది, ఉత్సవాలను విజయవంతం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES