మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ – ఆర్మూర్
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివారం విమర్శల గుప్పిచ్చారు. పంటకు గిట్టుబాటు ధర పెంచకుండా ఉన్న ధర ఇవ్వని ఏకైక ప్రబుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. నిజామాబాద్ లో మొక్క జొన్న కొనుగోలు చేయక రోడ్ల వెంబడి చూస్తే రైతుల బాధ వర్ణనాతీతమని ఆయన ఆవేదన చెందారు. వర్షాలకు దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఆర్మూర్ గడ్డ నుండి తిరుగుబాటు ప్రారంభం అవుతుంది అని హెచ్చరించారు. ఎర్రజొన్నల తరహా ఉద్యమం చేయడం ఖాయం అని, రైతులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని అన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలువలేదు అని, ఆర్మూర్ అడ్డా రైతులకు పోరాట గడ్డ అని, ఇక మీదట కాంగ్రెస్ నాయకులను ఎక్కడ కనబడినా గోరవ్ చేస్తాం అని అన్నారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అమలు చేయని రేవంత్ సర్కార్ కు గుణపాఠం చెప్పడానికి రోజులు దగ్గర్లో ఉన్నాయని అన్నారు.
రైతుల ఉసురుతో ప్రభుత్వం కొట్టుకపోతుంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES