Monday, October 6, 2025
E-PAPER
Homeదర్వాజహ్మ్...

హ్మ్…

- Advertisement -

లోతుల్లో దాగిన రహస్యాలు
ఇవ్వాళ కొత్త రంగులను పూసుకున్నాయి.
పెదవి దాటని మాటలు మౌనంగా
కంటికి తాకని బింబాలు
స్తబ్దతగా ఏవేవో కథలను చిత్రిస్తున్నాయి.
నిన్నటి సాయంత్రం ఒంటికాలి కాకి
స్మశానంలో దొరికే పిండం కోసం
ఏ దేవుడినైనా మొక్కుతుందా
బతుకంటే బరువు కాదని గూటి నుండి బయలుదేరే
తల్లిపిట్ట హితవు చెబుతూ
రేపటికి ఏ గింజను దాచలేదు మరి.
సాగిపోవడమే,
ఆగిపోవడంలో ఏ నిర్వచనం లేదు.

  • రామ్‌ పెరుమాండ్ల, 9542265831
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -