జూలై 19న ‘నేనూ… ‘నా ప్రపంచంపుస్తకావిష్కరణ వేముల సత్యనారాయణ రాసిన "నేనూ... నా ప్రపంచం ఉద్యోగ ప్రస్థానం" యాభై రెండేళ్ల డైరీ కథనం పుస్తకావిష్కరణ సాహితీ సోపతి ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్ లో ఈ నెల 19న ఉదయం పది గంటలకు జరుగుతుంది. అన్నవరం దేవేందర్, డా. మచ్చ హరిదాసు, డా. నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, పెద్దింటి అశొక్ కుమార్, డా. బి.వి.ఎన్.స్వామి, బూర్ల వేంకటేశ్వర్లు, అన్నాడి గజేందర్ రెడ్డి పాల్గొంటారు. కూకట్ల తిరుపతి కవి రచయిత, 994-924-7591 ' మా కథలు 2025కు ఆహ్వానం
డాక్టర్ వేదగిరి రాంబాబు జయంతి సందర్భంగా తెలుగు కథరచయితల వేదిక తెస్తున్న21వ ‘మా కథలు2025 సంకలనంలో ప్రచురణ కోసం, 2025 లో పబ్లిష్ అయిన కథపంపవలసిందిగా రచయితలకు ఆహ్వానం. కథలు ఆగస్టు 15 లోగా సి.హెచ్. శివరామ ప్రసాద్, కన్వీనర్, స్వగృహ అపార్ట్‌మెంట్, ‘సి’ బ్లాక్, జి2, భాగ్యనగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్` 500072 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9390085292.
వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం కై కవితా సంపుటాలకు ఆహ్వానం
అరసం వరంగల్ వారి ఆధ్వర్యంలో జరిగే ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం కోసం వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. కవితా సంపుటాలు 2022 జూలై నుండి 2026 జూన్ వరకు ప్రచురించిన మెుదటి ముద్రణలు 4 ప్రతులను ఆగస్టు 31 లోపు పంపాలి. పంపాలి. చిరునామా : బూర భిక్షపతి, ఇంటి నెంబర్, 2 – 12 – 293/20, రోడ్ నెంబర్ 2B, విజయనగర్ కాలని, గోపాలపురం రోడ్, హనమకొండ 506009. వివరాలకు : 9866612717
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -


