నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ జంట నగరాల్లో సిటీ బస్సు కనీస ఛార్జీని ఒకే సారి రూ. 10 పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి జేబులు గుల్లయినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ఈ ఛార్జీల పెంపు పిడుగులాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్య ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం మోపితే, బడుగుజీవులు, దినసరి కూలీలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ”ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, పెంచింది చాలదన్నట్టు, ఇప్పుడు కనీస ఛార్జీపై కనికరం లేకుండా 50 శాతం ధరలను పెంచడం దుర్మార్గమని విమర్శించారు. ”తుస్సుమన్న ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ సంస్థను దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం తగదని హితవు పలికారు.వెంటనే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బస్ చార్జీల పెంపుతో పేద, మధ్యతరగతి జేబులు గుల్ల : కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES