Tuesday, October 7, 2025
E-PAPER
Homeజిల్లాలుసుప్రీం గ్రీన్ సిగ్నల్.. హైకోర్టు వైపే ఎదురుచూపులు

సుప్రీం గ్రీన్ సిగ్నల్.. హైకోర్టు వైపే ఎదురుచూపులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళుతోంది. 42 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో హైకోర్టులో కొందరు పిటిషన్లు దాఖలు చెయ్యగా సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ఇక మిగిలింది ఈనెల 8న బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పువైపే ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అనుకూలంగా తీర్పు ఇస్తుందా.. లేక కొట్టిపారేస్తుందా రాష్ర్ట ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే ఈ నెల 8 వరకు వేచి చూడక తప్పదు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -