కేకే మహేందర్ రెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించిన కేకే..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సమానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సూచించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీని అందించారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు.
అందరి కృషితోనే జెడ్పిటిసి తో పాటు 14 ఎంపీటీసీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళ్లకు చెప్పు లేనోడు కూడా కారులో తిరిగాడని ఎద్దేవ చేశారు. ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో గెలుపొందే వారికి అధిష్టానం బి ఫామ్ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, వైద్య శివప్రసాద్, లింగాల భూపతి, పూర్మాణి లింగారెడ్డి,మచ్చ శ్రీనివాస్, సత్తు శ్రీనివాసరెడ్డి, మునిగేల రాజు,మహిళా మండల అధ్యక్షురాలు హారిక రెడ్డి, రాపెల్లి ఆనందం, పెద్దూరి తిరుపతి పాల్గొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES