Tuesday, October 7, 2025
E-PAPER
Homeసినిమాపక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

హీరో నాగ శౌర్య నటిస్తున్న నయా సినిమా ‘బ్యాడ్‌ బారు కార్తీక్‌’. పవర్‌ ఫుల్‌ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్‌ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన బర్త్‌ డే సందర్భంగా విడుదలైన అద్భుతమైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో స్ట్రాంగ్‌ బజ్‌ క్రియేట్‌ చేశారు. నూతన దర్శకుడు రామ్‌ దేసినా (రమేష్‌) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. టీజర్‌ నాగ శౌర్యను రగ్గడ్‌, ఇంటెన్స్‌ స్టైలిష్‌ న్యూ అవతార్‌లో ప్రజెంట్‌ చేసింది. యాక్షన్‌ సన్నివేశాలు, హై-ఆక్టేన్‌ మూమెంట్స్‌తో మాస్‌ పాత్రలో పరిచయం చేసింది. ఈ టీజర్‌లో శౌర్యతో పాటు విధి, సముద్రఖని, నరేష్‌ వికె, సాయికుమార్‌, మైమ్‌ గోపి, శ్రీదేవి విజరు కుమార్‌, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంలో ఇంటెన్స్‌ డ్రామా, హ్యూమరస్‌ కామెడీ కలగలిసి ఉన్నాయి. నాగ శౌర్య స్క్రీన్‌ ప్రెజెన్స్‌, షార్ఫ్‌ డైలాగ్‌ డెలివరీ, కమాండింగ్‌ బాడీ లాంగ్వేజ్‌ అదిరిపోయింది. వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్‌ మంచి హ్యుమర్‌ని అందించింది. దర్శకుడు రామ్‌ దేసినా అద్భుతమైన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను అందించారు. రసూల్‌ ఎల్లోర్‌ డైనమిక్‌ సినిమాటోగ్రఫీ బ్రిలియంట్‌గా ఉంది. హారిస్‌ జయరాజ్‌ ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ ఎమోషన్‌ని మరింత ఎలివేట్‌ చేసింది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా త్వరలోనే బిగ్‌ స్క్రీన్స్‌లోకి రానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
పథ్వీ, అజరు, ప్రియ, నెల్లూరు సుదర్శన్‌, కష్ణుడు, చమక్‌ చంద్ర, శివన్నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రామ్‌ దేశిన (రమేష్‌), నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి, డీఓపీ : రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: హారిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌- సుప్రీమ్‌ సుందర్‌, పధ్వి, కొరియోగ్రాఫర్స్‌: రాజు సుందరం, శోబి మాస్టర్‌, విజరు పొలంకి, శిరీష్‌, సాహిత్యం: చంద్రబోస్‌, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌, కష్ణకాంత్‌, ఎక్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శంకర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -