పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

కోలీవుడ్‌ కథానాయకుడు శివ కార్తికేయన్‌, మడోన్‌ అశ్విన్‌ కాంబోలో చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహావీరుడు’. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడిగా అదితి శంకర్‌ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్ర తెలుగు రైట్స్‌ని ఏసియన్‌ సినిమాస్‌ సొంతం చేసుకుంది. ఏసియన్‌ సినిమాస్‌ ద్వారా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో విడుదల కానుంది. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్‌ శంకర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్‌ గంగప్పన్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది

Spread the love