Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ జెండాలు ఎగురవేయడమే అజెండా

కాంగ్రెస్ జెండాలు ఎగురవేయడమే అజెండా

- Advertisement -

– స్థానిక ఎన్నికల దిశగా ఆలేరు కాంగ్రెస్ శ్రేణుల సన్నద్ధం
నవతెలంగాణ – ఆలేరు రూరల్

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆలేరు మండల కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యారు. సోమవారం  ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు ఆలేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ్రోజు వెంకటేశ్వరరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగురవేయడమే ప్రధాన అజెండాగా నిర్ణయించారు.గత ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ కోసం విధేయతతో పనిచేసినట్లే,ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో, సమష్టిగా పనిచేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

గ్రామస్థాయిలో పార్టీ అభ్యర్థులను గెలిపించడం ప్రతి నాయకుడి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ,మాజీ ఎంపీపీ గంధ మల్ల అశోక్, ఎంపీటీసీ సభ్యులు ఆర్.ప్రశాంత్ గౌడ్, బత్తుల నరేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య,ఎంఎస్ విజయ్ కుమార్,చింతకింది మురళి,ముదిగొండ శ్రీకాంత్,భాస్కర్,మాజీ సర్పంచులు,వార్డు సభ్యులు,యూత్ కాంగ్రెస్ మండల,గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -