-మలైకా అరోరా రేస్2విన్ ఫౌండేషన్..
డెక్కన్ డెర్బీ 2025లో రోహిత్ గాంధీ + రాహుల్ ఖన్నా కోసం ర్యాంప్ వాక్ చేసి అలరించారు..
నవతెలంగాణ – బంజారా హిల్స్
రేస్2విన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెక్కన్ డెర్బీ 2025 హైదరాబాద్ రేస్ క్లబ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో గుర్రపు పందేల మహాత్మ్యం, ఫ్యాషన్ ప్రపంచం యొక్క గ్లామర్‌తో మిళితమై, మరపురాని సాయంత్రంగా నిలిచింది. ఈ ఫ్యాషన్ షోలో ప్రముఖ డిజైనర్ జంట రోహిత్ గాంధీ,రాహుల్ ఖన్నా తమ కొత్త కలెక్షన్ “ఫ్యాషన్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్”ను ఆవిష్కరించారు. ఇందులో మలైకా అరోరా షోస్టాపర్‌గా మెరిశారు. ఈ ఫ్యాషన్ ప్రదర్శనను ప్రత్యేక ప్రయివేట్ షోగా తరాలు వచ్చారు.
ఇది డెర్బీ యొక్క శాశ్వత స్ఫూర్తిని, సొగసును, సాంస్కృతిక వైభవాన్ని జరుపుకుంటూ.. రేస్2విన్ ఫౌండేషన్ చేపడుతున్న సానుభూతి ఆధారిత సామాజిక మార్పు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వహులు తెలిపారు. ఈ వేడుకలో అర్జున్ బజ్వా, లేఖా ప్రాజాపతి, రెజీనా కసాండ్రా, రోహిత్ ఖండెల్వాల్, అవంతిక మిశ్రా, పర్వతి నాయర్, నైరా బెనర్జీ, ఏకతా రాథోడ్, అక్షర గౌడ, సందీప్ సరోజ్, విరాజ్ అశ్విన్, సాయి రోణక్, శ్రీనాథ్ మగంటి, మరియు రాశి సింగ్ వంటి ప్రముఖులు హాజరై, సాయంత్రం యొక్క గ్లామర్‌కి మరింత జోష్ నింపారు.
ఆదివారం రాత్రి జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ప్రత్యేక ప్రసంగం చేశారు. తరువాత, రేస్2విన్ ఫౌండేషన్ స్థాపకుడు వై. గోపి రావు ఫౌండేషన్ కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించారు. “రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అర్థవంతమైన అనుభవాలు సృష్టించేందుకు మేము ఎదురుచూస్తున్నాం,” అని వై. గోపి రావు, రేస్2విన్ ఫౌండేషన్ స్థాపకుడు అన్నారు. రోహిత్ గాంధీ,రాహుల్ ఖన్నా సంయుక్త ప్రకటనలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. “డెక్కన్ డెర్బీ 2025లో భాగమవ్వడం నాకు అద్భుతమైన అనుభూతి. ఈ సాయంత్రం ఉత్సాహంతో, అందమైన ప్రజలతో, రేసింగ్,ఫ్యాషన్ కలయికతో నిండిపోయిందనీ మలైకా అరోరా అన్నారు.