నవతెలంగాణ – బల్మూరు
దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) పై దాడికి నిరసనగా మండల కేంద్రం బల్మూరులో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు అధ్యక్షులు మాట్లాడుతూ.. భారత న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేని విధంగా వ్యవహరించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పట్ల అనుచితంగా వ్యవహరించి అవమానించడాన్ని అంబేద్కర్ యువజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను అవమానపరిచిన న్యాయవాదిని వెంటనే విధుల నుండి తొలగించి చట్టపరమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో బిజెపి పాలనలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్న స్పందించడం లేదని అందుకే ఇలాంటి ఎన్నో సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. దేశంలో సనాతనం అని పురాతనం అని బిజెపి పదేపదే ప్రజలను మభ్యపెడుతుండడం వల్లనే ఇలాంటి చాందస భావాలు పెరిగిపోతున్నాయని.. న్యాయ వ్యవస్థను రాజ్యాంగాన్ని గౌరవించలేకపోతున్నారని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే భవిష్యత్తులో దళిత సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాలు మరియు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్ట నున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చంద్రమౌళి సంఘం సభ్యులు గణేష్ కుమార్, గంగాధర్, శ్రీనివాసులు, మాజీ అధ్యక్షులు తగిలి శ్రీనివాసులు, తిరుపతయ్య, చాంద్ పాషా, వెంకటయ్య ఉన్నారు.
సీజేఐపై దాడి.. అంబేద్కర్ యువజన సంఘం నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES