ఇజ్రాయిల్ దాడులను ఆపి వేయాలి
ఆకుల పాపయ్య జిల్లా కార్యదర్శి సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
గాజా పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న జాతి హననానికి వ్యతిరేకిద్దాం. గాజా ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుదాం అంటూ మంగళ వారం నిజామాబాద్ నగరంలోనీ IFTU ద్వారక నగర్ కార్యాలయం నుండి వీక్లీ బజార్ చౌరస్తా వరకు న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ ఇజ్రాయిల్ మారణ హోమం వలన ఆరు వేలకు పైగా (6000) గాజా ప్రజలను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. దాంట్లో ముక్కుపచ్చలు ఆరని చిన్న పిల్లలను సైతం చంపుతున్నారని, తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేకుండా నరహంతక అమెరికా తో చేతులు కలిపి మానవ హననానికి పాల్పడుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు గాజా ప్రజలకు ఓడల ద్వారా ఆహారాన్ని అందించడానికి వెళ్తే వాటిని కూడా బాంబుల ద్వారా ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఈ విధ్వంసాన్ని ఆపడానికి భారత్ ఇజ్రాయిల్ పై ఒత్తిడి తీసుకురావాలి అన్నారు. పాలస్తీనా, గాజా లలో ఉన్న చమురు నిక్షేపాలను చేజిక్కించుకునీ ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చేయించడానికి అమెరికా పడుతున్న కుట్ర అని విమర్శించారు.
పాలస్తీనా ప్రజలకు అండగా ఉందాం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES