నవతెలంగాణ – మిరుదొడ్డి
ఆన్లైన్ బెట్టింగ్ ఆడి తన ప్రాణాలు కోల్పోయిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం వీరరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జంగం ఎల్లయ్య, చిన్న లక్ష్మీల కుమారుడు రాజు సిద్దిపేట పట్టణంలోని బజాజ్ మొబైల్ షోరూం లో పనిచేస్తూ జీవన కొనసాగిస్తున్నాడు. రాజు కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ వేసి అధికంగా అప్పులు కావడంతో తీవ్ర ఇబ్బంది పాలయ్యాడు. చేసిన వేతనం డబ్బులు సరిపోక అప్పులు తీర్చేది స్థితి నెలకున్నది. తల్లిదండ్రులు గ్రామంలో ఉండి కొడుకు పని చేస్తున్నానని దీమతో ఉన్న తల్లిదండ్రుల ఆశలు అడివాసాలుగా మారాయి. సోమవారం రాజు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా అప్పులు ఎక్కువ కావడంతో పురుగుల మందు సేవించి ఆసుపత్రి పాలయ్యాడు. మంగళవారం సాయంత్రం సమయంలో రాజు తీశాసవించాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ఆన్లైన్ బెట్టింగ్.. ప్రాణం తీసింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES