- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
సుప్రీంకోర్టులో సీజేఐ బీఆర్ గావాయి పైన అడ్వకేట్ రాకేష్ కిషోర్ దాడిని ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంగళవారం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరఫున, ఇతర ఉపాధ్యాయ సంఘాలు కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ .. సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో ఇటువంటి సంఘటన జరగడం అవమాననీయమైనదని ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ సంఘాలు పాల్గొని నిరసన వ్యక్తం చేశాయి.
- Advertisement -