Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజేఐ గవాయ్ పై దాడి చేసిన లాయర్ ను కఠినంగా శిక్షించాలి

సీజేఐ గవాయ్ పై దాడి చేసిన లాయర్ ను కఠినంగా శిక్షించాలి

- Advertisement -

రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు..
నవతెలంగాణ- రాయపోల్

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై లాయర్ రాకేష్ కిషోర్ న బార్ కౌన్సిలింగ్ శాశ్వతంగా సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిజెఐ గవాయ్ పై దాడి చేయడమంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ లౌకిక పునాదిని కూల్చివేసి, న్యాయవ్యవస్థను మతపరమైన ఆటబొమ్మగా మార్చడానికి ప్రయత్నించే శక్తులకు ఇది ఒక పరాకాష్ఠన్నారు.అత్యున్నత న్యాయస్థానంపై జరిగిన దాడి కేవలం ఒక సంఘటన కాదు, ఇది భారత రాజ్యాంగంపై మత వాదుల యుద్ధ ప్రకటన అన్నారు.

న్యాయస్థానం దేవుడి కోట కాదు, న్యాయమూర్తి మత గురువు కాదు.లౌకిక పునాదిపై దాడి మన రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రం ఏ మతానికీ అనుకూలంగా ఉండదు, వ్యతిరేకంగానూ ఉండదు. ఖజురాహో ఆలయ విగ్రహం పునరుద్ధరణ పిటిషన్‌ను సిజెఐ గవాయ్ కొట్టివేయడం ఈ లౌకిక సూత్రానికి నిదర్శనం. ఆ సమస్య ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చట్ట పరిధిలోకి వస్తుందని చెప్పడం న్యాయపరమైన విధి. న్యాయమూర్తి చేసిన ఆ రాజ్యాంగబద్ధమైన వ్యాఖ్యను విష్ణుమూర్తిని అడగండని వక్రీకరించి ప్రచారం చేయడం జరిగింది.న్యాయమూర్తినే భయ పెట్టడం అంటే అది  ప్రజాస్వామ్యానికి పతనమన్నారు.

రాకేష్ కిషోర్ సిజెఐపై తన షూ తో దాడి చేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు అంటూ వ్యాఖ్యలు చేయడు.దేశ అత్యున్నత న్యాయస్థానంలో కుల మత జాతి వర్గ భేదం లేకుండా ప్రవర్తించాల్సింది పోయి సనాతన ధర్మం అంటూ మతపరమైన వ్యాఖ్యలు ప్రస్తావించడం సిగ్గుచేటు అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకపోతే దేశంలో నివసిస్తున్న సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి చర్యలు దేశానికి ప్రమాదకరమని ప్రపంచ దేశంలో భారతదేశం విలువ తగ్గించే విధంగా ఈ చర్యలు ఉన్నాయన్నారు. కాబట్టి ఈ దుర్ఘటనకు పాల్పడిన లాయర్ రాకేష్ కిషోర్ ను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -