Wednesday, October 8, 2025
E-PAPER
Homeసినిమానవ్వించే 'మిత్ర మండలి'

నవ్వించే ‘మిత్ర మండలి’

- Advertisement -

నిర్మాత బన్నీ వాస్‌ స్థాపించిన బి.వి. వర్క్స్‌ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్‌, వైరా ఎంటర్టైన్మెంట్స్‌ పతాకాలపై రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. కళ్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మాతలు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. నూతన దర్శకుడు విజయేందర్‌ ఎస్‌ దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్‌, విష్ణు ఓఐ, రాగ్‌ మయూర్‌, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో ఈచిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ‘లిటిల్‌ హార్ట్స్‌’ చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొని, ట్రైలర్‌ ఆవిష్కరణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ,’థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు సంతోషంగా నవ్వుకొని బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాము. జాతిరత్నాలకు రెట్టింపు నవ్వులు పంచి, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాం’ అని అన్నారు. ‘ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యముంటుంది. మొదటి సినిమాలోనే ఇంత మంచి పాత్ర రావడం సంతోషంగా ఉంది’ అని నిహారిక ఎన్‌ఎమ్‌ చెప్పారు. సమర్పకులు బన్నీ వాస్‌ మాట్లాడుతూ, ‘మూడు నెలల క్రితం ‘లిటిల్‌ హార్ట్స్‌’ టీమ్‌ తమ సినిమాని విడుదల చేయమని నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌ కోసం నేను వాళ్ళని పిలిచాను. ఇది నిజమైన విజయం అంటే. ఇది చాలా మంచి కథ. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -