రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈనెల 31న ఈ సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా సుమతో కలిసి ఒక ఉల్లాసమైన, వినోదాత్మక సంభాషణలో చిత్ర బృందం పాల్గొంది. ఈ సినిమా ఎంత ప్రత్యేకమైనదో తెలిపేలా వీరి సంభాషణ సాగటం విశేషం. రవితేజ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ఆర్‌పీిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారిగా నటించాను.
ఇది నా సినీ ప్రయాణంలో సరికొత్త, ప్రత్యేకమైన పాత్ర. దర్శకుడు భాను భోగవరపు అద్భుతంగా తీస్తే, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అత్యద్భుతంగా సంగీతాన్ని అందించారు. వినోదం, మాస్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు. ‘రవితేజతో కలిసి నటించడం చాలా ఆనందకరమైన అనుభవం. ఈ సినిమాలో సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. నా మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే బాగా నవ్వుకున్నాను. ఇక సెట్‌లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయి’ అని నాయిక శ్రీలీల చెప్పారు.
ఆర్‌పీిఎఫ్ అధికారిగా రవితేజ
- Advertisement -
- Advertisement -