Wednesday, October 8, 2025
E-PAPER
Homeఆటలుకెప్టెన్‌గా మిచెల్‌ మార్ష్‌

కెప్టెన్‌గా మిచెల్‌ మార్ష్‌

- Advertisement -

భారత్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు

సిడ్నీ: ఈ నెల 19 నుంచి ఆరంభం కానున్న భారత్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్లను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. మూడు వన్డేలు, ఐదు టీ20లకు ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయంతో దూరం కావటంతో.. ఆల్‌రౌండర్‌కు సారథ్య పగ్గాలు దక్కాయి. ఆ జట్టు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌పై సెలక్షన్‌ కమిటీ వేటు వేసింది. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 47 పరుగులే చేసిన లబుషేన్‌ను భారత్‌తో సిరీస్‌కు పక్కనపెట్టారు.

స్టార్‌ పేసర్‌ మిచెల్‌ గత ఏడాది నవంబర్‌ తర్వాత తొలిసారి వన్డే ఫార్మాట్‌లో పునరాగమనం చేయనుండగా.. విధ్వంసక ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ గాయంతో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న కామెన్‌రూన్‌ వన్డే జట్టులో నిలిచినా.. టీ20లకు దూరంగా ఉన్నాడు. పెర్త్‌, ఆడిలైడ్‌, సిడ్నీలో వన్డేలు జరుగనుండగా.. కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌, హౌబర్ట్‌, గోల్డ్‌కోస్ట్‌, బ్రిస్బేన్‌లో టీ20 మ్యాచులను షెడ్యూల్‌ చేశారు. నవంబర్‌ 8న ఐదో టీ20తో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన ముగియనుంది.

ఆస్ట్రేలియా వన్డే జట్టు : మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), జేవియర్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), కూపర్‌, బెన్‌, నాథన్‌ ఎల్లీస్‌, కామెరూన్‌ గ్రీన్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌, ట్రావిశ్‌ హెడ్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), మిచెల్‌ ఓవెన్‌, మాట్‌ రెన్షా, మాథ్యూ షార్ట్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడం జంపా.
ఆస్ట్రేలియా టీ20 జట్టు : మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, జేవియర్‌, టిమ్‌ డెవిడ్‌, బెన్‌, నాథన్‌ ఎల్లీస్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌, ట్రావిశ్‌ హెడ్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), నాథన్‌ కున్హేమాన్‌, మిచెల్‌ ఓవెన్‌, మాథ్యూ షార్ట్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆడం జంపా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -