Wednesday, October 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసురభి కాలేజి చైర్మెన్‌, ప్రిన్సిపాల్‌పై వారెంట్‌

సురభి కాలేజి చైర్మెన్‌, ప్రిన్సిపాల్‌పై వారెంట్‌

- Advertisement -

గత ఆదేశాలు పాటించలేదని హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెంటనే ఇవ్వాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను సిద్ధిపేటలోని సురభి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పాటించక పోవడంపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజి చైర్మెన్‌తో పాటు ప్రిన్సిపాల్‌పై బెయిలబుల్‌ వారెంట్‌ చేస్తూ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్‌ మెరుగు కార్తిక్‌ సురభి కాలేజిలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అతని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఆయన ఇటీవల హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన కమిషన్‌ వెంటనే కార్తిక్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించింది.

అయితే కమిషన్‌ ఆదేశాలను సదరు కాలేజి పాటించలేదు. దాంతో కార్తిక్‌ పీజి ప్రవేశానికి గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేక పోవడంతో ఆయన విద్యా సంవత్సరం వృథా ఆయింది. కమిషన్‌ ఆదేశాలను సురభి కాలేజి పాటించక పోవడం వల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తూ తిరిగి హెచ్‌ఆర్‌సీని బాదితుడు ఆశ్రయించారు. కాలేజి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్మెన్‌తో పాటు ప్రిన్సిపల్‌పై కమిషన్‌ వారెంట్‌ జారీ చేసింది. అలాగే 2020లో జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందిన ఏడేండ్ల చిన్నారి తిప్పర్తి సహస్ర మరణం ఆల్బెండజోల్‌ మాత్ర తీసుకున్న తర్వాత సంభవించిందని వచ్చిన వార్తాపత్రిక కథనంపై కమిషన్‌ సుమోటో కేసు నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -