Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

- Advertisement -

జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

హెపటైటిస్ బి కిట్లు, రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆదేశించారు. బుదవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ షారోన్ షైని క్రిస్టినాను ఆస్పత్రి, ఆయా గ్రామాలకు చెందిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. హెపటైటిస్ బి కిట్లు, రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి  నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలని, జ్వరంకు సంబంధించి రక్త పరీక్షలు చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని‌ సూచించారు.

సీజనల్ వ్యాధులలో ఈగలు, దోమల వల్ల కలిగే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా డెంగ్యూ,చికున్ గున్యా,ఫైలేరియా, మెదడు వాపు  లాంటి వ్యాధులు అరికట్టడానికి పరిసరాల పరిశుభ్రత పాటించాలని  ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని,100 ఇండ్ల చుట్టూ గల పరిసర ప్రాంతాలలో డెమో పాస్ స్ప్రే చేయాలని పేర్కొన్నారు. ఇంటింటికి జ్వరం సర్వే ఆశా కార్యకర్తలచే నిర్వహించలని, ప్రతి శుక్రవారం నిర్వహించే ఇంటింటి కార్యక్రమం యొక్క ముందస్తు ప్రణాళికలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. లార్వా నివారణ కొరకు వాడే టెమోఫాస్ ను అందుబాటులో ఉంచుకోవాలని, డెంగ్యూ కేసు వచ్చిన గ్రామంలో నాలుగు వారాలపాటు ఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై. శంకర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ , ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ల్యాబ్ టెక్నీషియన్ అనితా రాథోడ్, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి, ఆనంద్, నర్సింగ్ ఆఫీసర్ ప్రకాష్, గంగామణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -