నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూర్ గ్రామంలో కొమురం భీమ్ విగ్రహానికి బుధవారం పౌర్ణమి 85 వర్ధంతి సందర్భంగా గ్రామ ఆదివాసి నాయకపోడ్ సంఘా అధ్యక్షుడు మీనుగు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకపోడ్ మండల ప్రధాన కార్యదర్శి మేడిపల్లి గౌతమ్ సంఘం సీనియర్ నాయకుడు మీనుగు నాగరాజు మాట్లాడుతూ.. మా ఆదివాసుల ఆరాధ్య దైవం భూమికోసం నీరు కోసం అడవి కోసం పోరాడి అడవి పైన హక్కులు మాకే చెందాలని నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బారిన కొమరం భీం వర్ధంతిని మా ఆదివాసులు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో పౌర్ణమి నాడు జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ మాజీ అధ్యక్షుడు మేడిపల్లి గిరీష్, బుర్రోళ్ళ గంగాధర్, మేడిపల్లి సాగర్, అంబటి సురేష్, ప్రసాద్ మీనుగు ధర్మ రాజు తదితరులు పాల్గొన్నారు.
చేపూర్ లో కొమురం భీం విగ్రహానికి నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES