Thursday, October 9, 2025
E-PAPER
Homeబీజినెస్వివాదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలి

వివాదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలి

- Advertisement -

టాటా గ్రూపునకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ :
టాటా ట్రస్టీలో బోర్డు నియామకాలు, పాలనా అంశాల్లో నెలకొన్న వివాదాలను అంతర్గంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. టాటా గ్రూప్‌లోని కీలక వ్యక్తులు అయినటువంటి టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా, వైస్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, టాటా సన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖర్‌, ట్రస్టీ డారియస్‌తో మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశమయ్యారు. వివాదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని వారు సూచించారు. అవసరమైతే సమస్యకు కారణమయ్యే ట్రస్టీని తొలగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి చర్యలు చేపట్టయినా సరే టాటా ట్రస్ట్స్‌లో స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని మంత్రులు సూచించారని తెలుస్తోంది. భారత ఆర్థికవ్యవస్థకు టాటా గ్రూప్‌ సహకారం చాలా ముఖ్యమైందని.. కంపెనీలో ఎలాంటి వివాదమైనా సరే దాన్ని అంతర్గతంగా, వివేకంతో పరిష్కరించుకునేలా చర్యలు ఉండాలని మంత్రులు సూచించారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -