Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

- Advertisement -

– హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు
– 1,620 రాజకీయ పార్టీల పోస్టర్లు, వాల్‌ రైటింగ్‌, బ్యానర్ల తొలగింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల అధికారులు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ)ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌ రెవెన్యూ డివిజన్లలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పలు ప్రాంతాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లు క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేశాయి. ఎవరైనా భారీ ఎత్తున నగదు, విలువైన వస్తువులను తీసుకెళ్తాన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

అనుమతులు లేని ప్రకటనల తొలగింపు
అనుమతులు లేని ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లను ఎన్నికల అధికారు లు తొలగించారు. ఇప్పటికే 1,620 రాజకీయ పార్టీల పోస్టర్స్‌, వాల్‌ రైటింగ్‌, బ్యానర్స్‌ గుర్తించగా వీటిలో 1,097 ప్రభుత్వ ఆస్తులు, 523 వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయని అధికారు లు గుర్తించారు. 1950 ఎలక్షన్‌ హెల్ప్‌లైన్‌, సి-విజిల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా 24/7 ఫిర్యాదులను పర్యవేక్షించ నున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లను నియోజకవర్గ వ్యాప్తంగా రంగంలోకి దించారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేయ నున్నాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉపఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిష నర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్ని చర్యలను తీసు కుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను రాజకీ య పార్టీలు, ప్రతినిధులు తప్పక పాటి ంచాలని ఇప్పటికే అదేశాలు జారీ చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేవిధంగా అందరి సహాయ సహకారాలను అంది ంచాలని సూచించారు. ఎవరైనా మోడ ల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘనలకు పాల్పడితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -