Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇంటర్‌ గెస్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

ఇంటర్‌ గెస్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

- Advertisement -

మాజీ మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ గెస్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ గెస్ట్‌ లెక్చరర్లకు 9 నెలల పెండింగ్‌ వేతనాలు బాకీ పడ్డారని తెలిపారు. జీతాలు ఇవ్వక, ఉద్యోగాలు మానేసే పరిస్థితి వారికి కల్పించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి పెండింగ్‌లో పెడితే వారి కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో కళాశాలకు వెళ్లకూడదని వారు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. లెక్చరర్లు కాలేజీలకు రాకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు? సిలబస్‌ ను ఎవరు పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. సర్కారు నిర్లక్ష్యంతో లెక్చరర్లతో పాటు విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -