Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరద కాలువకు గండిపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

వరద కాలువకు గండిపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద వరద కాలువకు గండి పడి పెద్ద ఎత్తున నీరు బయటకు వస్తున్న నేపథ్యంలో సంబంధిత ఇరిగేషన్ శాఖ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ, ఫ్లడ్ ఫ్లో కేనాల్ ఈఈ లతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. వరద కాలువకు గండి పడటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొన్న భారీ వర్షాల వల్ల వచ్చిన వరదతో అక్విడేక్ట్ డౌన్ స్ట్రీమ్ లో వరద కెనాల్ మట్టి కొట్టుకపోవడంతో గండి పడి ఉంటుందని అధికారులు ఆయనకు తెలిపారు.వరద కాలువ గేట్లు మూసి ఉన్నాయని వరద కాలువలో నీటి నిల్వ తగ్గిన తర్వాత సమస్యను కనుక్కొని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.ప్రస్తుత మున్న ఫ్లడ్ ఫ్లో కేనాల్ అక్విడెక్ట్ స్ట్రక్చర్ కి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.సమస్య కనుగొన్నాక మళ్ళీ తనకు సమాచారము అందించాలని, అవసరమైనతే పై అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

తహసిల్దార్ తో మాట్లాడిన ఎమ్మెల్యే…..

మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండి పడి పెద్ద ఎత్తున నీరు బయటకు వస్తుండటంతో విషయం తెలిసిన వెంటనే మోర్తాడ్ తహషీల్దార్ తో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.వాగు వెంబడి గాండ్లపేట గ్రామంలోని ఎస్సీ, బీసీ బీదవాళ్ళ పొలాలు ఉంటాయన్నారు. వరద కాలువకు గండి పడి నీరు పెద్దవాగు లోకి వస్తుండటంతో వాగు ఒడ్డు కోతకు గురై పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో వ్యవసాయ శాఖ అధికారి సహకారంతో జరిగిన పంట నష్టం  లెక్కలు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని తహసిల్దార్ ను  ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -