Monday, September 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయాదగిరిగుట్టలో భక్తుల కిటకిట

యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవ శోభతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఈ సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వెంకట్రావు ఈ కార్యక్రమానికి స్వయంగా నేతృత్వం వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పలు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, భక్త సమాజాలకు చెందిన సభ్యులు, సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గోమాతను ముందుంచుకుని, జాతీయ పతాకాన్ని చేతబూని, స్వామివారి నామస్మరణ చేస్తూ, భక్తి ప్రపత్తులతో కొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణ పూర్తిచేశారు. భక్తుల కోలాహలంతో యాదగిరి కొండ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -