Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌష్టికాహారంతోనె సంపూర్ణ ఆరోగ్యం..

పౌష్టికాహారంతోనె సంపూర్ణ ఆరోగ్యం..

- Advertisement -

నవతెలంగాణ – కోహెడ
బాలింతలు, గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకుంటెనే చిన్నారులకు సంపూర్ణం ఆరోగ్యంగా ఉంటారని సీడీపీవో జయప్రద అన్నారు. గురువారం మండలంలోని శనిగరం గ్రామంలో హుస్నాబాద్‌ ప్రాజెక్ట్‌ సెక్టార్‌ పరిధిలో పోషణమాసం కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారంలో నూనె, ఉప్పు, చెక్కర వాడకాన్ని తగ్గించాలని, అంగన్‌వాడీలో ఇచ్చే ఆహారాన్ని తప్పక తీసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం తీసుకుంటేనె ఆరోగ్యవంతమైన శివులకు జన్మనిస్తారని సూచించారు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలతో వయసుకు తగిన బరువు, ఎత్తు పెరిగి లోప పోషణకు గురికాకుండా ఉంటారన్నారు. కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు తప్పక తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ కవిత, సుజాత, నాగరాణి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -