Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు పొలంబడి శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి

రైతు పొలంబడి శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో మేనూర్,మొగ, మద్నూర్ గ్రామాలలో సోయాబీన్ పంట రైతు పొలం బడి శిక్షణ కార్యక్రమంలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. రైతులకు సోయాబీన్ కొత్త రకం బాగుందని, రైతులు  పంట కోత తర్వాత వచ్చే వానకలానికి కొన్ని విత్తనాలను ఉంచుకొని  వేసుకోవాలని , మరియు మిగతా రైతులకు విత్తనం కొరకు ఇచ్చుకోవాలని సూచించారు. అలాగే పత్తి పంటను ఏరువాక శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించి తగు సస్యరక్షణ చర్యలు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏరువాక శాస్త్రవేత్తలు అనిల్ రెడ్డి, రేవంత్, మండల వ్యవసాయ అధికారి రాజు, ఏఈ వో లు అనిల్, విశాల్, సౌమ్య మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -