ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి హరికిరణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాచార హక్కు చట్టం 2025లో భాగంగా బెస్ట్ పర్‌ఫార్మెన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కింద అవార్డు రావడం ఎక్సైజ్ శాఖ పనితీరుకు నిదర్శనమని ఆ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ అన్నారు. గురువాం రవీంద్ర బారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీద అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అవార్డును ఎక్సైజ్ శాఖ ఉద్యోగులందరికీ అంకితమిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఐదేండ్లలో అబ్కారీ శాఖకు సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించినందుకు ఆయన సిబ్బందిని అభినందించారు. భవిష్యత్‌లో అన్ని విషయాల్లో తమ శాఖ పారదర్శంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో పాటు విధుల్లో నిబద్దతతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.