Saturday, October 11, 2025
E-PAPER
Homeసినిమాప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా

ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా

- Advertisement -

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ ఎం జంటగా నటించిన చిత్రం ‘మిత్రమండలి’. విజయేందర్‌ దర్శకత్వంలో బీవీ వర్క్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ సమర్పణలో సప్తాస్వ మీడియా వర్క్స్‌ పై కళ్యాణ్‌ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన చిత్రమిది. ఈ మూవీ ఈనెల 16న రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కళ్యాణ్‌ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు.

‘మిత్ర మండలి’ జర్నీ ఎలా ప్రారంభమైంది?
బన్నీ వాస్‌ మాకు మంచి స్నేహితులు. గీతా ఆర్ట్స్‌లో మేం చాలా కాలం ఆయనతో పాటుగా పని చేశాం. ‘కోటబొమ్మాళీ పీఎస్‌’, ‘ఆయ్’, ‘తండేల్‌’, ‘సింగిల్‌’ ఇలా చాలా చిత్రాల్ని చేశాం. ఈ కథ వినమని వాసు చెప్పారు. స్టోరీ చాలా నచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్‌గా ఉంటుంది.

దర్శకుడు విజయేందర్‌ గురించి?
విజయేందర్‌ మంచి దర్శకుడు. అనుదీప్‌, ‘మ్యాడ్‌’ కళ్యాణ్‌, ఆదిత్య హాసన్‌లతో విజయేందర్‌ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్‌తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు.

ప్రియదర్శి, నిహారిక, బ్రహ్మానందం పాత్రలు ఎలా ఉండబోతోన్నాయి?
‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్‌ టౌన్‌ను డైరెక్టర్‌ క్రియేట్‌ చేశాడు. ఆ ఫిక్షనల్‌ టౌన్‌లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం ఎక్కువగా యూత్‌కు రిలేట్‌ అవుతుంది. వారికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. నిహారిక మాట్లాడితే ఓ సెటైర్‌ కనిపిస్తుంది. ఇందులో అలాంటి పాత్రే ఉంటుంది. అందుకే ఆమెను తీసుకున్నాం. ఇక ప్రియదర్శి గురించి వేరే చెప్పక్కర్లేదు. అలాగే బ్రహ్మానందం పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్‌ గింబర్‌ లాలా’ పాటను అనుకోకుండా బ్రహ్మానందంతో చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్‌ను బాగా ఎంజాయ్ చేశారు.

‘జాతి రత్నాలు’తో ఈ సినిమాని పోల్చుతున్నారు కదా?
‘మిత్ర మండలి’ అనేది కూడా బడ్డీస్‌ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’ సినిమాతో పోల్చుతున్నారు. అయితే ఆ కథకు, మా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీలాగే మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు.

కుల వ్యవస్థ మీద సెటైర్స్‌ వేశారట. నిజమేనా?
అవును. ‘మిత్ర మండలి’ కోసం లేని ఓ కులం పేరుని తీసుకువచ్చాం. అలా చేసిన ఫిక్షనల్‌ క్యాస్ట్‌తో సమాజంలో ఉన్న క్యాస్ట్‌ సిస్టం మీద సెటైరికల్‌గా సీన్లను చిత్రీకరించాం.

మీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌లు ఎలా ఉండాలనుకుంటున్నారు?
మేం అన్ని రకాల జోనర్లలో చిత్రాల్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్‌తో వస్తున్నాం. త్వరలోనే హర్రర్‌ మూవీని ప్రారంభించనున్నాం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచి కథలతో సినిమాల్ని తీస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -