Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 14న రాష్ట్రబంద్ కు బీసీ సంఘాల పిలుపు

ఈనెల 14న రాష్ట్రబంద్ కు బీసీ సంఘాల పిలుపు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఈనెల 14న రాష్ట్ర బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు వీగిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని,బీసీల ఆశలను తన రాజకీయ వికృత క్రీడా కోసం సీఎం రేవంత్ రెడ్డి బీసీలను వాడుకొని, వంచించాడ నీ అన్నారు. గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్ లో ఉండగానే కావాలని, కుట్రపూరితంగా తీసుకొచ్చి.. దాన్ని కోర్టులో వీగిపోయేటట్టు చేశాడని,రెడ్డి జాగృతి నాయకుడు మాధవరెడ్డి వెనకాల సీఎం ఉన్నాడని అన్నారు.

బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు దక్కకుండా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని,దీన్ని బీసీ సమాజంగా  ఎదుర్కొంటాం అని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రాజకీయ సమాధి చేస్తాం అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -