Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక లారీలతో రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం.!

ఇసుక లారీలతో రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం.!

- Advertisement -

నిబంధనలు పాటించని మల్లారం క్వారీ నిర్వాహకుడు
యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని మల్లారం ఇసుక క్వారీ నుంచి నిత్యం వెళ్లడంతో నాగులమ్మ నుంచి మల్లారం వరకు రోడ్డు, అరేవాగుపై ఉన్న బ్రిడ్జి ధ్వంసం కావడమే కాకుండా, దుమ్ముదులితో వరి, పత్తి, మిర్చి రైతులు పంటలు దెబ్బతినడం, ప్రయాణికులు ఇబ్బందులకు గురివుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఇసుక లారీలను నిలిపివేయాలని భారత యువజన సమాఖ్య (యువైఏప్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో మాట్లాడారు మండలంలోని మల్లారం ఇసుక క్వారీ నిర్వాహకుడు ప్రభుత్వ నియమ, నిబంధనలు, సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా వాపోయారు. క్వారీ వద్దకు నిత్యం వందలాది లారీలు రావడంతో నాగులమ్మ నుంచి మల్లారం వరకు  రోడ్డు, అరేవాగుపై బ్రిడ్జి ధ్వంసం అయ్యాయని తెలిపారు. క్వారీకి పార్కింగ్ లేకపోవడంతో లారీలు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయడం ద్వారా నిత్యం ద్విచక్ర ఇతర ప్రయాణికులు ఇబ్బందులకు గురివుతున్నారని పేర్కొన్నారు. లారీలలో ఇసుక త్వరగా లోడింగ్ కావాలంటే క్వారీ నిర్వాహకులు ఒక్కొక్క లారీ వద్ద రూ.3వేల నుంచి రూ.4 వేలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వాపోయారు.క్వారీ నిర్వాహకుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లిన టిజిఎండిసి అధికారులు క్వారీపై తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా క్వారీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -