Sunday, October 12, 2025
E-PAPER
Homeఖమ్మంఎన్నికలు ఎప్పుడు అయినా బీఆర్ఎస్ దే విజయం..

ఎన్నికలు ఎప్పుడు అయినా బీఆర్ఎస్ దే విజయం..

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిన అభివృద్ధి పనులు ఏవీ లేవని, తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మంజూరు చేసిన పనులను కూడా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

శుక్రవారం అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం లో మడకం మల్లేశ్వరరావు–గంగమ్మ దంపతుల కుమారుడు దుర్గా ప్రసాద్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. తరువాత నారాయణపురం లో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పరస్పర ఐక్యతతో పని చేసి పార్టీని ఘన విజయానికి నడిపించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మందపాటి రాజమోహన్ రెడ్డి, చందా లక్ష్మీ నరసయ్య, నారం రాజశేఖర్, మిండ దుర్గా రావు, తల్లాడ వెంకటేశ్వరరావు, సొమ్లా, నల్లపు చందర్ రావు, కాటూరి నాగేంద్ర, నాగయ్య, రమణయ్య, చిలకయ్య, జక్కుల అర్జున్, చందా కుమారస్వామి, పసుపులేటి శివ, కౌలూరి నరేష్, రమణ, తుంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -