బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను తాజాగా హీరో సత్య దేవ్ రిలీజ్ చేశారు. ‘ఈ కథ ధర్మానికి అడ్డొస్తే.. మేనమామ అయినా, లక్షల బంధుగణమైనా, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా.. ధర్మ హింస తథైవచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు. ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణహౌమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడిది’ అంటూ ఎంతో పవర్‌ఫుల్‌గా సాగిన డైలాగ్‌తో టీజర్‌ను అద్భుతంగా ప్రారంభించారు.
హీరో ఎంట్రీ.. గుడి, గుప్త నిధిని చూపించినట్టుగా వేసిన షాట్స్, హీరో, హీరోయిన్ల ట్రాక్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్‌ను గూస్ బంప్స్ వచ్చేలా కట్ చేశారు. మరీ ముఖ్యంగా టీజర్ చివర్లో కత్తితో నరికే సీన్ మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇక ఈ టీజర్‌కి మణిశర్మ ఇచ్చిన ఆర్‌ఆర్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంది. ‘పార్కింగ్’ మూవీ ఫేమస్ జిజ్జు సన్నీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ టీజర్‌లోనే ఇంత గ్రాండ్‌నెస్ కనిపిస్తుందంటే.. సినిమా వేరే లెవెల్లో ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు అని చిత్ర యూనిట్ తెలిపింది.
ధర్మం కోసం పోరాడే యువకుడి కథ
- Advertisement -
- Advertisement -