Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ వేతనాలు చెల్లించి అదనపు పని భారాలు తగ్గించాలి: సీఐటియు డిమాండ్

పెండింగ్ వేతనాలు చెల్లించి అదనపు పని భారాలు తగ్గించాలి: సీఐటియు డిమాండ్

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్ కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన మూడు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని, అదనపు పని భారాలు తగ్గించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయు జిల్లా కార్యాలయంలో జరిగిన స్వీపర్ల మండల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్ లకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు ఐనప్పటికి కార్మికులకు అందజేయడంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగ వ్యవహారిస్తున్నారని విమర్శించారు.

పెండింగ్ వేతనాలపై ఇదివరకే కలెక్టర్ దృష్టికి రెండుసార్లు తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందన్నారు. ఇచ్చే అతి తక్కువ వేతనాలను ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడం లేదని, ప్రభుత్వం నుంచి వేతనాలు మంజరై రెండు నెలలు కావొస్తున్న కార్మికులకు ఇవ్వడం లో అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. విద్యాశాఖ అధికారులు కార్మికుల హాజరు శాతన్ని తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేతనాలు సక్రమంగా చెల్లించకపోగా జాబ్ చార్ట్ లో లేని పనులు చేయిస్తూ అదనపు పని భారలతో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

కార్మికులు వేతనాల కోసం కలెక్టర్ కార్యాలయం, DEO, CPO కార్యాలయాల చుట్టూ ఇంకా తిరగవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికార యంత్రాంగ  సమన్వయ లోపం వల్ల కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   వేతనాలు వెంటనే విడుదల చేయాలని, అదనపు పని భారలు తగ్గించాలని, ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి వేతనాలు వెంటనే అందించే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు రఘు, కార్మికులు సంతోషమ్మ, మల్లమ్మ భాగ్యమ్మ, బుచ్చమ్మ సువర్ణ, తస్లీమ, హాజీరా బేగం సువర్ణ, శారదమ్మ పద్మ, సరోజమ్మ గోపెమ్మ శ్రీనివాస్, బుచ్చన్న హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -