- Advertisement -
నవతెలంగాన – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి వెళ్లనున్నట్లు సమాచారం. పార్టీ తరపున టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను పంపించే అవకాశం ఉంది.
- Advertisement -