Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుచేయాలి: సీఐటీయూ

కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుచేయాలి: సీఐటీయూ

- Advertisement -

సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటస్వామి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, పని భారం తగ్గించి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాజోలి మండల కేంద్రంలో లక్ష్మన్న అధ్యక్షతన సీఐటీయూ మండల రెండవ మహాసభ జరిగింది. ఈ మహాసభకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచుకుంటూ పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయని, పనికి తగ్గ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అంగన్ వాడి మరియు ఆశ వర్కర్లకు ఆన్ లైన్ వర్క్అంటూ పని భారం పెంచుతున్నారని, దానివల్ల మహిళలు మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, పని భారం తగ్గించి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కల్పించాలని అన్నారు.  ఇంత పని చేస్తున్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని, సెంటర్ అద్దెలు కూడా బకాయి ఉన్నాయని బకాయి అద్దెలు వెంటనే చెల్లించాలని కోరారు.  గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల మొదటి వారంలోనే వేతనాలు ఇవ్వాలని, పంచాయతీ నుండి ఇవ్వాల్సిన తొమ్మిది నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ నుండి ఇవ్వాల్సిన పరిహారాలను సకాలంలో ఇవ్వాలని, గుర్తింపు కార్డులు రెన్యువల్ కాకుండా పెండింగ్ లో ఉన్న వాటిని రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.  ఈ నెల చివరి వారంలో గద్వాలలో నిర్వహించబోతున్న సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులంతా సంఘటితమై సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 

కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు చేసే పోరాటాలకు కెవిపిఎస్ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మండలంలోని అన్ని రంగాల కార్మికులను ఐక్యం చేసి సంఘాలు ఏర్పాటు చేయాలని అందుకు తమ వంతు సహకారం, మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఐటీయూ రాజోలి మండలం కన్వీనర్ గా డి. లక్ష్మన్న, కో- కన్వీనర్ గా సుజాత, కమిటీ సభ్యులుగా మహాలక్ష్మి, సుశీల, సువర్ణ, సౌలు రాజు, నడిపన్న, నరసింహులు, జయన్న మరియు తిక్కన్న లతోపాటు 11 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -