Monday, May 12, 2025
Homeమానవిలేడీ విత్‌ ది లాంప్‌

లేడీ విత్‌ ది లాంప్‌

- Advertisement -

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌… బ్రిటిష్‌ నర్సు, సామాజిక సంస్కర్త. తన కాలంలో ఆస్పతులను సంస్కరించేందుకు విశేషమైన కృషి చేశారు. చివరకు ఆమె పేరే ఆ వృత్తికి పర్యాయపదంగా మారింది. అంటే ఆ రోజుల్లో ఆమె అందించిన వైద్య సేవలు అంతటి గుర్తింపును పొందాయని చెప్పుకోవచ్చు. అందుకే ఆమెను ప్రపంచమంతా ‘లేడీ విత్‌ ది లాంప్‌’గా పిలచుకుంటారు. అంతటి గొప్ప వైద్య సేవకురాలి జయంతి సందర్భంగా ఆమె పరిచయంతో పాటు ఇద్దరు నర్సింగ్‌ ఆఫీసర్స్‌ తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ 1820, మే 12న ఇటలీలోని ధనిక కుటుంబంలో జన్మించారు. మొదటి నుండి సేవా భావం కలిగిన ఫ్లోరెన్స్‌ నర్సుగా తన జీవితాన్ని కొనసాగించాలనుకున్నారు. కానీ తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదు. ఆ రోజుల్లో ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావాలనే భావన బలంగా ఉండేది. అందుకే అందరు ఆడపిల్లల్లా తన బిడ్డ కూడా పెండ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని వారు కోరుకున్నారు.
సంఘం మీద తిరగడ్డారు
ఆ రోజుల్లో ఆస్పత్రులు శుచి, శుభ్రత లేకుండా అధ్వాన్నంగా ఉండేవి. అందుకే ఆమె రోగులకు సేవలు అందించాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు అహర్నిశలూ కృషి చేశారు. దీనికోసం ఆమె ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో ఆమె ఒక విధంగా సంఘం మీద తిరగబడ్డారనే చెప్పుకోవాలి. కేవలం వైద్య సేవలు అందించడం మాత్రమే కాదు మహిళల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం కూడా పోరాడారు.
సైనికులకు సేవ చేసేందుకు
క్రిమియన్‌ యుద్ధంలో గాయపడిన సైనికులకు వైద్యం అందించేందుకు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పూనుకున్నారు. ఈ యుద్ధం 1853 – 1856 మధ్య జరిగింది. రష్యన్లు ఒకవైపు – బ్రిటిష్‌, ఫ్రెంచ్‌, ఒట్టోమన్‌ టర్క్‌లు మరోవైపు ఉన్నారు. 1854లో ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అధికారికంగా అనుమతి పొందిన 38 మంది మహిళల బృందానికి నాయకత్వం వహించారు. అనారోగ్యంతో, గాయపడిన బ్రిటిష్‌ దళాలకు చికిత్స చేయడానికి స్కుటారిలోని బరాక్‌ ఆసుపత్రికి (ఇప్పుడు ఇస్తాంబుల్‌లో ఉస్కుదార్‌ అని పిలుస్తారు) ఆ బృందం చేరుకుంది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఆమె అత్యధిక సంఖ్యలో గాయపడిన సైనికులను చూశారు. వీరిలో చాలామందికి భయంకరమైన కలరాతో సహా ఇతర ఇన్ఫెక్షన్లను కూడా సంక్రమించాయి.
ఏరి కోరి ఎంచుకున్న వృత్తి
అవసరమైన మందులు, ఆరోగ్య సంరక్షణ పరికరాలను కొనుగోలు చేయడంతో పాటు, ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ వార్డులను క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూసుకునేవారు. ఆమె పాటించే ప్రాథమిక ఆరోగ్య ప్రమాణాలు, పరిశుభ్రత, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతకు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె రోగులను 24 గంటలూ కనిపెట్టుకొని ఉండేవారు. గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించారు. వారికి ధైర్యం చెప్పేవారు. ధనవంతుల కుటుంబంలో పుట్టినా ఏరి కోరి ఆమె ఈ వృత్తిని ఎంచుకున్నారు. శ్రద్ధతో, ఇష్టంతో తన బాధ్యతలు నెరవేర్చేవారు. అప్పట్లో ఆమె ఎంతో మందికి నర్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఎంతో గుండె నిబ్బరంతో చిమ్మ చీకట్లో కూడా చిరు దీపం వెంట తీసుకెళ్లి సేవలు చేసేవారు. రోగుల ముఖం మీద చిరునవ్వు ఆమె చేతిలో దీపంలా వెలిగేది. ఇలా నర్సింగ్‌, ఆరోగ్య సంరక్షణలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను అందరూ లేడీ విత్‌ ది ల్యాంప్‌గా పిలుచుకుంటున్నారు.
మన దేశానికి ఆమె సేవలు
ఒకరోజు సైనికులకు సేవలు అందిస్తూ ఆమె స్పృహ కోల్పోయారు. సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకూ వచ్చింది. తిరిగి కోలుకొని తన వైద్య సేవలు కొనసాగించారు. ఆ రోజుల్లో మగవారు మందుకు బానిసలై ఇల్లు పట్టించుకునేవారు కాదు. వారిలో మార్పు తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు. అందరికీ చదువుకునేందుకు గ్రంథాలయాలను అందుబాటులో ఉండేటట్లు చేసి అక్షరాస్యతను పెంచారు. మన దేశానికి కూడా ఆమె తన సేవలందించారు. 1859లో చెన్నై నగరంలో ఆమె సహకారంతో మహిళలకు నర్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆమె సలహాలతో దేశంలో మరణాల రేటు తగ్గింది. వైద్య రంగంలో ఇంతటి సేవలు అందించిన ఆమె 1910 ఆగస్టు 13న మరణించారు. సేవా నిరతిగల ప్రతి నర్సులో ఆమె కలకాలం జీవించే ఉంటారు.

  • పాలపర్తి సంధ్యారాణి

    రోగులకు మానసిక ధైర్యం అవసరం
    రోగులకు సేవ చేస్తున్నపుడు నాకు ఏమనిపిస్తుందంటే.. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఎక్కువ శాతం పేద ప్రజలు. కాబట్టి నా అభిప్రాయం వాళ్లకి మేము ఇచ్చే ట్రీట్‌మెంట్‌ కంటే మేము పలకరించే విధానం, వారితో మాట్లాడే పద్ధతి ద్వారా వారు డిస్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లేటపుడు వాళ్ల కళ్లలో ఆనందాన్ని చూసి సంతోషపడతాను. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో కావాలని హాస్పిటల్‌కి రావాలని కోరుకోరు. వాళ్ల లాస్ట్‌ ఆప్షన్‌లో మాత్రమే హాస్పిటల్‌కు వస్తారు. అలా వచ్చిన వారికి మేము ఇచ్చే ధైర్యం చాలా ముఖ్యం. ఇక నా 26 ఏండ్ల వృత్తి జీవితంలో గర్భిణీల డెలివరీ నుండి 90 ఏండ్ల వయసు వారి వరకు సర్వీస్‌ ఇచ్చాను. గుర్తుంచుకోవడానికి ఎంతో మంది ఉన్నారు. నేను ఎక్కువ వర్క్‌ చేసింది చిన్న పిల్లలు, డెలివరీ వార్డ్‌, వృద్ధాప్యం వారికి సేవలు అందించే ఓపీలో. చాలా తృప్తి పొందిన సేవలు గుండె జబ్బుల విభాగం, ఐసీయూ వార్డ్‌లో చావు బతుకుల మధ్య పోరాటం చేసే రోగులను ఎప్పటికీ మర్చిపోలేను.
    నర్సింగ్‌ విద్యార్థులకు నా సలహా ఏమిటంటే అన్నీ ప్రొఫెషన్‌లా నర్సింగ్‌ను చూడకూడదు. ఈ వృత్తిలోకి రావాలనుకున్న వారు అంకిత భావం, సేవా దృక్పథంతో పని చేయాలి. మరీ ముఖ్యంగా కష్టంతో ఇబ్బందులు పడే రోగులకు మానసిక ధైర్యం నింపే విధంగా ఆప్యాయతను అందించాలి. చదువుకునే పుస్తకాల పై దృష్టి పెట్టటమే కాకుండా రోగులకు సేవ చేసేటపుడు మనసా, కర్మణా శ్రద్ద చూపిస్తే చాలు. న్యాయంగా, నీతిగా, ధర్మంగా వర్క్‌ చేస్తే చాలు. మనం చేసే సేవ నిండు మనసుతో చేస్తే చాలు. ఇదే నేను తర్వాతి తరానికి ఇచ్చే సలహా.
  • జి.తిరుమలదేవి, సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌, ఎంజీఎం హాస్పిటల్‌

    సేవా దృక్పథంతో…
    మాది జనగాం జిల్లా నర్మెట మండలం, పురము గ్రామం. అమ్మ సంతోషమ్మ, నాన్న దేవయ్య. మాది వ్యవసాయ కుటుంబం. మేము ముగ్గురం పిల్లలం. అన్నయ్య కుమార్‌, చెల్లి లావణ్య. మా ముగ్గురిని చదివించి ప్రయోజకులను చేయాలని తపించారు. మా నాన్న ఆనారోగ్యంతో మరిణించారు. అప్పటి నుండి మా ముగ్గురిని అమ్మ పట్టుదలతో వంట పని చేస్తూ చదివించింది. నర్మెటలో, కరుణాపురంలో నా స్కూల్‌ చదువు పూర్తి చేశాను. ఇంటర్‌ కూడా అక్కడే చదివాను. మా అమ్మ కష్టాన్ని చూసి చీబఅ ూఱర్‌వతీ వీశీబఅఱసa, ఖీa్‌ష్ట్రవతీ ణష్ట్రaఅ ూaబశ్రీ ూబbaతీబ, కొలోంబో ఫాదర్‌ నా చదువుకు సాయం చేశారు. నేను చదువుకునే రోజుల్లో నన్‌ సిస్టర్స్‌ కృష్ఠివ్యాది రోగుల మధ్య సేన చేస్తుండడం చూసి నేను కూడా ఈ విధమైన సేవ చేయాలని నిర్ణయించికున్నాను. అలా నేను నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేశాను. ఇప్పటికి నా సర్విస్‌ 21 ఏండ్లు. మొదటగా హైదరాబార్‌ ప్రైవేట్‌ హాస్పటల్లో స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తున్న సమయంలో గల్ఫ్‌లో పని చేసే అవకాశం వచ్చింది. మూడేండ్లు కింగ్‌ డమ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియాలో రోగులకు సేవ చేశాను. 2011లో ప్రభుత్వ శాఖలో ఉద్యోగం వచ్చింది. నా మొదటి పోస్టింగ్‌ రిమ్స్‌ హాస్పిటల్‌, వరంగల్‌. ప్రస్తుతం హైదరాబాద్‌ కాన్సర్‌ హాస్పిటల్లో చేస్తున్నాను. అనారోగ్యంతో హాస్పిటల్‌కు వచ్చే బాధితులకు ధైర్యం చేబుతూ సేవ చేసే అవకాశం వచ్చింది. ధైర్యం చెబుతుంటే వాళ్లు ఎంతగానే ఆనందించేవారు. ఇలా నేను చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వ అధికారులు ఆవార్డులు కూడా ఇచ్చారు. ఈ మధ్యకాలంలోనే మా కోసం ఎంతో కష్టపడి, మమ్మల్ని ప్రయోజకులను చేసిన మా అమ్మ మరణించింది. నా భర్త జి.ప్రతాప్‌ కుమార్‌, మా అమ్మాయి, అబ్బాయి జి.మెన్విత, జి.మెన్విన్‌ నాకు ఎంతో సహకరిస్తారు. ముఖ్యంగా నా కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల సహకారంతోనే ఇన్నేండ్ల నుండి నేను ఈ వృత్తిలో కొనసాగ గలుగుతున్నాను. కొంత మంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్లు చేసి వైద్య సలహాలు అడుగుతుంటారు. రోగులకు ఇంకా మెరుగైనా సేవలు అందించాలని ఆశపడుతున్నాను. నేను పని చేసే హస్పిటల్లోనే కాక, మా సొంత ఊరులో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం చాలా ఉంది.
  • బొంకురి లలిత
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -