సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకటస్వామి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఏ. వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వస్తు, సేవల ఎగుమతి దిగుమతులలో, వాటిని సాధారణ ప్రజలకు అందజేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న హమాలీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు అందించే సేవల వల్లే ప్రభుత్వాల పాలన విధానాలు సక్రమంగా సాగుతున్నాయని, ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయని గుర్తు చేశారు.
కార్మికుల ఆదాయాలు పెరిగితేనే, వస్తు సేవల కొనుగోలు పెరిగి ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం అవుతుందని కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల యొక్క ఆదాయాల పెరగకపోవడం కూడా దేశంలో పెరుగుతున్న ఆర్థిక మాంధ్యానికి ప్రధాన కారణం అని అన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సంపదను మరింత కేంద్రీకరించే చర్యలకు పాల్పడుతుండడం దారుణం అన్నారు. కార్మిక వర్గానికి ఉపాధి పెరిగితేనే ఆదాయాల పెరుగుతాయని, తద్వారా కొనుగోలు శక్తి పెరిగి, ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
కార్మికులకు ఉపాధికి భద్రత,కనీస వేతనాలు అమలు,పని ప్రదేశాలలో సౌకర్యాలు,పియఫ్ ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అమలు చేయకపోగ దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక వర్గ చట్టాలకు సవరణ చేస్తూ కార్మిక హక్కులను కాల రాస్తున్నదని విమర్శించారు. హమాలీ కార్మికులకు పని ప్రదేశాలలో ప్రత్యేక అడ్డాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యాత హమాలీ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకుంటూ, కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నాయని విమర్శించారు.కార్మికులు సంఘటీతంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ,హమాలీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రంగన్న, బాలకృష్ణ కార్మికులు మజ్జిగ ఆంజనేయులు, బలరాం,లక్ష్మన్న,రామకృష్ణ,విష్ణు,వీరేష్ బాబన్న,భాస్కర్,నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
హామాలీల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES