Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చలకుర్తి అంగన్వాడీలో ఘనంగా పోషణ మాసం

చలకుర్తి అంగన్వాడీలో ఘనంగా పోషణ మాసం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
అనుముల అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలోని పెద్దవూర మండలం చలకుకుర్తీ అంగన్వాడీ కేంద్రాలలో సోమవారం పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామం లో ర్యాలీ నిర్వహించారు.పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కౌమారదశలో ఉన్న బాలికలలో పోషకాహార లోపాలను తగ్గించడానికి, పౌష్టికాహారంపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించారు. లబ్ధిదారులకు పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరిస్తారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై,ఆరోగ్య లక్ష్మీ పథకం కింద ఆహారాన్ని అందించడం, ఆరోగ్య పరీక్షలు చేయడం వంటి కార్యక్రమాల పై వివరించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు, పాలు పౌష్టికాహారం తీసుకోవానని తెలిపారు. ఈ కార్యక్రమం లో చలకుర్తీ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ,సూపర్ వైజర్ గౌసియా బేగం,అంగన్వాడీ టీచర్లు శాంతమ్మ,యాదమ్మ,లబ్ధిదారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -