నవతెలంగాణ – బిచ్కుంద
ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు అంటూ బిచ్కుంద పట్టణంలో గల మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు బస్టాండ్ ముందర రోడ్డుపై బైఠాయించి ప్రిన్సిపల్ మ్యామ్ డౌన్ డౌన్ అనే ఫ్లికార్డులు పట్టుకొని ఈ ప్రిన్సిపల్ మాకొద్దు అంటూ వినాదాలు చేశారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న సునీత బండారి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మెనూ ప్రకారం భోజనం అందివ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుండి వెళ్ళేది లేదని రోడ్డు పైనే బైఠాయించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లిపోవాలని మీ సమస్యలు పై అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలే తప్ప ఇలా రోడ్లపై రోడ్డుపై బైఠాయించి రాకపోకలకు ఇబ్బంది కలిగించరాదని విద్యార్థులకు సర్ది చెప్పారు. ఆ సమయంలో అక్కడి నుండి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే విద్యార్థులను గమనించి వారితో మాట్లాడి విద్యార్థుల వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్న జిల్లా అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లిపోయారు.
ఈ ప్రిన్సిపల్ మాకొద్దంటూ రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES