Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏపీ మాదిరిగా ''బీసీ రక్షణ చట్టం''

ఏపీ మాదిరిగా ”బీసీ రక్షణ చట్టం”

- Advertisement -

– సీఎం రేవంత్‌ రెడ్డి సానుకూల స్పందన
– ముఖ్యమంత్రితో బీసీ నేతల చర్చలు
నవతెలంగాణ-హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా మన రాష్ట్రంలోనూ బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌. కష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆర్‌.కష్ణయ్య, బీసీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే రాష్ట్రంలోనూ ‘బీసీ రక్షణ చట్టం’ తీసుకొని హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీల వెంకటేష్‌, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ళ సతీష్‌, బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పర్లగోర్ల మోడీరాందేవ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -