Wednesday, January 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త అడ్వెంచరస్‌ టాక్‌షో

సరికొత్త అడ్వెంచరస్‌ టాక్‌షో

- Advertisement -

రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమర్పణలో స్టార్‌ హీరోలతో ఓ ట్రావెల్‌ బేస్డ్‌ అడ్వెంచరస్‌ టాక్‌ షో ప్రారంభం కానుంది. అదే ‘సోల్‌ ట్రిప్‌’. ఈ అడ్వెంచరస్‌ టాక్‌ షో మన టాలీవుడ్‌ స్టార్‌ హీరోస్‌తో ప్రేక్షకులను అలరించనుంది. ఇది వరకు ‘పోస్టర్‌, అన్వేషి’ వంటి సినిమాలు చేసిన హీరో, నిర్మాత విజయ్ దాట్ల తన సొంత బ్యానర్‌ గండభేరుండ ఆర్ట్స్‌పై ఈ సెలబ్రిటీ టాక్‌షో సీజన్‌1ను ముగించుకుని, త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఛానెల్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘సోల్‌ ట్రిప్‌’ టాక్‌ షో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మొదటి సీజన్‌లో హీరో జగపతిబాబు, శ్రీకాంత్‌, స్టార్‌ కమెడియన్‌ అలీ, హీరోయిన్స్‌ శివానీ రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వర్ష బొల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ టాక్‌ షో గురించి హీరో, నిర్మాత విజయ్ దాట్ల మాట్లాడుతూ, ‘ఇప్పట వరకు ఈ తరహా టాక్‌ షో తెలుగులో రాలేదు. ఆద్యంతం వినూత్నంగా ఉంటూ ప్రేక్షకులను మా టాక్‌ షో అలరిస్తోందనే నమ్మకం ఉంది. సీజన్‌1 చాలా అద్భుతంగా వచ్చింది. ఈ షో కోసం జగపతిబాబు, శ్రీకాంత్‌, అలీ, శివానీ రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వర్ష బొల్లమ్మ తదితరులు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఇలాంటి భిన్నమైన టాక్‌ షోతో మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. కాన్సెప్ట్‌ – హోస్ట్‌- డైరెక్టర్‌ : విజయ్ దాట్ల, సహ నిర్మాతలు : పి.యు. ఎన్‌.వర్మ, ఖుషి, కొల్లిగోపాల్‌ కృష్ణ, చైతన్య కలిదిండి, కన్నా శ్రీకృష్ణ, సినిమాటోగ్రఫీ :అచ్యుత్‌వర్మ, మ్యూజిక్‌ : సాహిత్య సాగర్‌, ఎడిటర్‌ : అనీల్‌ అల్లూరి, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ : కార్తీక్‌ అన్నం, క్రియేటివ్‌ రైటర్‌ : నివాస్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -