Monday, May 4, 2026
E-PAPER
Homeజాతీయంఆరు దశాబ్దాల చరిత్రకు బ్రేక్..

ఆరు దశాబ్దాల చరిత్రకు బ్రేక్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో ఒక ఊహించని బ్లాక్‌బస్టర్… ఎవరూ అంచనా వేయని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఆవిష్కృతమైంది. ఆరు దశాబ్దాలకు పైగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) చారిత్రక విజయం దిశగా దూసుకెళుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, అధికారాన్ని కైవసం చేసుకునే అంచున నిలిచి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాల్లో మధ్యాహ్నం 1 గంట సమయానికి టీవీకే రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్‌కు కేవలం 11 సీట్ల దూరంలో నిలిచింది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ద్రవిడ దిగ్గజాల మధ్య నూతన శక్తిగా బరిలోకి దిగిన టీవీకే, అందరి అంచనాలను తలకిందులు చేసింది. 1962లో కె. కామరాజ్ నేతృత్వంలోని కాంగ్రెస్ తర్వాత తమిళనాడులో ఒక ద్రవిడేతర పార్టీ అధికారం చేపట్టడం ఇదే ప్రథమం కానుంది.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ ఎన్నికల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం లేదనుకున్న ఓటర్లకు విజయ్ ఒక కొత్త ‘ఎంపిక’ను అందించారు. పెరియార్ సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని తన ప్రచారంలో జోడించి, డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -