Monday, May 26, 2025
Homeజిల్లాలురైతుల కోసం కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి..

రైతుల కోసం కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి..

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: భువనగిరి మండలంలోని వడపర్తి కత్వ నుండి భువనగిరి పెద్ద చెరువులోకి నీళ్లు పోయే రాచకాలపై హనుమాపురం గ్రామంలో రైతులు తమ పంట పొలాలకు పోయి రావడానికి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలో రైతుల పొలాల మధ్య నుండి వెళ్తున్న కాలువను రైతులతో కలిసి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం బస్వాపురం ప్రాజెక్టు నుండి వడపర్తి కత్వలోకి నీళ్లు తెచ్చి ఆ నీళ్లను కాలువ ద్వారా భువనగిరి పెద్ద చెరువులోకి పంపియడానికి రైతుల పొలాల మధ్యన నుండి కాలువను వెడల్పు లోతు చేసినప్పుడు కాల్వ అవతల భూములు ఉన్న  రైతులు, వృత్తిదారులు తమ పొలాల దగ్గరికి తమ ఆవుల, మేకల, గొర్రెలు, గేదెల దగ్గరికి  ఏవిధంగా వెళ్తారో నన్న విషయాన్ని పాలకులు, అధికారులు ఎందుకు గమనించలేదని ప్రశ్నించారు. దాదాపు పది మందికి పైగా రైతులు 60 ఎకరాల పైగా భూములు, చెరువు కుంట అనేక రకాలైన వ్యవసాయ భూములు కాలువ అవతలి భాగంలో ఉన్నాయని అన్నారు. తమ పంట పొలాలను సేద్యం చేసుకుని, పాలు పిండుకొని, చెరువులో మత్స్యకారుల చాపలు పట్టుకొని, గొర్ల మేకల పెంపకం దారులు తమ గొర్రెలను మేకలను పెంపడానికి చెరువులోకి వెళ్లి వస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో బ్రిడ్జి లేకపోతే కాలువను దాటి ఎట్లా పోయి వస్తారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోమ రాములు, పన్నాల భాస్కర్ రెడ్డి మరియు పొన్నాల హరినాధరెడ్డి పొలాల మధ్య నుండి వెళ్లిన కాల్వపైన తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నర్సింహ డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ మాట్లాడుతూ.. రైతులకు సాగు నీరు ఇచ్చే పేరుతో తమ పంట పొలాల దగ్గరికి వెళ్లకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా అడ్డుకోవడం అడ్డంగా కాలువ తీయడం ఎట్లా కరెక్టని ప్రశ్నించారు. ఆనాడు చిన్న కాలువ ఉంటే ఆ కాలువ దాటి రైతులు, వృత్తిదారులు తమ తమ పనులను వస్తు పోతూ చేసుకునేవారని ఈనాడు పెద్ద కాలువ తీసి దానిమీద దాటడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఎట్లా అని ఆవేదన వెలిబుచ్చా. ఇప్పటికైనా తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, నిర్మాణం చేపట్టే వరకు కాల్వ పనులను ఆపాలని లేకపోతే కాల్వ పనులను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని , కాల్వ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్ను వారు హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, శాఖ సభ్యులు దయ్యాల మల్లేశం, గ్రామ రైతులు సోమ రాములు, మల్లయ్య అంజయ్య, రాజేష్, మహేష్, శివ, ప్రభాకర్, పద్మ, పన్నాల పద్మారెడ్డి, నర్సిరెడ్డి, చంద్రారెడ్డి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -